జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు.మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని తెలిపారు. కానీ ఇంటి సమస్యను పబ్లిక్‌లో పెట్టారని చెప్పారు. వాస్తవం ఏముందో ప్రజల ముందు తీసుకుపోవడానికి మీడియా ప్రయత్నించిందన్నారు.ఏపార్టీకి సపోర్ట్‌గా మీడియా ఉండదని అన్నారు. ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందన్నారు. మీరు తప్పు చేశారు.. క్షమాపణ చెప్తే బాగుంటుందని తెలిపారు. మీరు మీడియాకి క్షమాపణలు చెప్పి, గాయపడిన జర్నలిస్టుని పరామర్శించడం మంచిదని సూచనలు చేశారు. ఎందుకంటే మీడియా హీరోని జీరో కూడా చేయగలదని చెప్పారు.
BJP MLA Raja Singh Comments on Manchu Family Dispute
మోహన్ బాబు గారూ.. మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది: రాజాసింగ్
మీరు మీడియాకి క్షమాపణలు చెప్పి, గాయపడిన జర్నలిస్టుని పరామర్శించడం మంచిది
ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందని మీకు సలహా ఇస్తున్నా
మీరు తప్పు చేశారు.. క్షమాపణ చెప్తే బాగుంటుంది
- ఎమ్మెల్యే… pic.twitter.com/QWg79ANwtw
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)