క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌ కలిసి నటిస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ చెప్పి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌.బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్‌ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పుడీ డైలాగ్‌ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

తాజా డైలాగ్ లీక్‌తో కొంత రిలాక్స్‌ అవుతున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లోనే తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు‌‌.

Hari Hara Veera Mallu Leak Dialogue

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)