బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని నామకరణం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది.

‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందన్న విషయం ఆ యువకునికే తెలియదు. అతనే శివా’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌ గంభీరంగా ఉంది. బ్రహ్మాస్త్రం కోసం పోరాటం, దుష్టశక్తుల యుద్దం.. అద్భుతమైన లవ్‌స్టోరీ..ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్‌లో చూపించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)