బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని రిలీజ్ చేస్తున్నారు. చేతిలో త్రిశూలంతో వెనకాల మహాదేవుడు పరమశివుడున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని పోస్టర్‌లో ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అనే అర్ధం. మన పురాణా ఇతిహాసలైన రామాయణ, మహా భారతంలో బ్రహ్మాస్త్రం గురించి వివరాలున్నాయి. ఇపుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో నటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ -1ను 9 సెప్టెంబర్ 2022న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీని దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ నేపథ్యంలో తెరకెక్కించారు. పంచ భూతాలైన భూమి, అగ్ని,నీరు, వాయువు, ఆకాశం చెరే పట్టే దుష్టశక్తులను అంతం చేసే పాత్రలో హీరో రణ్‌బీర్ కపూర్ నటించారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ శివ అతీంత్ర శక్తులున్న పాత్రలో నటించారు. ముఖ్యంగా అతన్ని అగ్ని కాల్చదు. నీరు తడపలేదు అంటూ భగవద్గీతలో ఆత్మకు ఉన్న లక్షణాలు హీరోకు ఉంటాయి. ఇతర ముఖ్యపాత్రల్లో అమితాబ్ బచ్చన్, నాగార్జున నటించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)