ప్రముఖ సీనియర్ నటి జమున(86) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలోనే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక, సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడినట్లు అయ్యిందన్నారు. జమున కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడినట్లు అయ్యిందన్నారు. జమున కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Here's CM Jagan Tweet
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)