ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు.

ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇటువంటి సమయంలో సీఎం జగన్‌ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)