ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన అనిత తాజాగా కండోమ్స్ యాడ్ చేసి సంచలనం రేపింది. భర్తతో కలిసి కండోమ్ ను ఎలా వాడాలి.. ఆ కండోమ్ యొక్క పని తీరు గురించి కూడా ఆడవారికి వివరించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ యాడ్ కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక బాబుకు తల్లి అయిన అమిత్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ కొడుకుతో ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇంట్లో ఉంటూ కూడా అనిత కొన్ని ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రమోషన్స్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)