దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు మంత్రిగారితో షేర్ చేసుకోవడానికి వచ్చాని వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భేటీకి ముందు ఇక్కడికి తాను సినీ పెద్దల కామెంట్స్‌, లేఖలపై స్పందించేందుకు రాలేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని, నాగార్జున వ్యాఖ్యలపై కానీ, లేఖలు, ఇతరత్రా కామెంట్స్‌పై మాట్లాడేందుకు తాను రాలేదన్నాడు. కేవలం సినీ దర్శకుడిగానే మంత్రి పేర్నీ నానిని కలుస్తున్నానని, సినిమా టికెట్ల ధరల అంశంపై తన అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపాడు. ఫైనల్‌ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. కాగా నేడు(సోమవారం) ఉదయం వర్మ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి చేరుకున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)