దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక జంటగా నటించిన సీతా రామం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు.యుద్ధం రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.ఈ కథలో కొంతభాగం 1960లలో నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ .. సుమంత్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.
Sweet trailer of what seems like a Magical tale :) #SitaRamamOnAug5 @mrunal0801 @dulQuer @iSumanth @VyjayanthiFilms https://t.co/UzGVpjoJqC
— Adivi Sesh (@AdiviSesh) July 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)