టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఈగల్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచిన సినిమా బృందం ఇప్పుడు టీజర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టీజర్ చూస్తుంటే రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయమని అనిపిస్తోంది. బాంబు పేలిన తర్వాతి దృశ్యాలతో, రవితేజ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది.ఈ టీజర్ లో రవితేజ లుంగీ కట్టి, చేతిలో తుపాకీతో మరింత మాస్‏గా కనిపించారు.

‘కొండలో ఉన్న లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు, నీ ఉనికీ ఉండదు’ అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. రవితేజ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అనుపమ పరమేశ్వరన్.. అతడు ఎక్కడుంటాడని అడగగా, అడవిలో ఉంటాడని అవసరాల శ్రీనివాస్ జవాబిస్తాడు. అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడని చెప్పడం సస్పెన్స్ ను రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా, మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Hero Ravi Teja is more of a myth than a man in this action-thriller

Here's Eagle Teaser

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)