పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఒక యువతి ఎయిర్‌పోర్టులో ఫోటో దిగింది. ఆ ఫోటో 'సాహో' సినిమా సమయంలోనిది అయినప్పటికీ తాజాగా మళ్లీ ట్రెండ్‌ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌పై ఆ యువతికి ఉన్న అభిమానం, సంతోషం వంటి ఆనంద క్షణాలు అందరినీ మెప్పించాయి. ఎయిర్‌పోర్టులో డార్లింగ్‌ను గుర్తించిన ఆ యువతి ఫోటో దిగిన అనంతరం ప్రభాస్‌ చెంపపై తన చేతితో ప్రేమగా కొడుతుంది. ఆ క్షణం తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు.

అప్పుడు ప్రభాస్‌ కూడా నవ్వుతూ ఆనందించాడు. మరికొద్దిరోజుల్లో ప్రభాస్‌ సలార్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రభాస్‌కు సంబంధించిన పలు వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. డిసెంబర్‌ 22న సలార్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పుడు షారుక్‌ ఖాన్‌ డుంకీ సినిమాతో పోటీ పడుతున్నాడు మన డార్లింగ్‌ ప్రభాస్‌.

Female fan slaps Salaar actor Prabhas after taking selfie with him VIDEO goes viral

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)