గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.నేడు రామ్ చరణ్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)