మెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ డైలాగ్‌ను తాజాగా ట్విట్టర్లో షేర్‌ చేయడం ఇటు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా నిలిచింది.మంగళవారం చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ తన వాయిస్‌ ఓవర్‌తో ఉన్న ఆడియోను షేర్‌ చేశారు. దీంతో చిరు రాజకీయ రీఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ డైలాగ్‌ షేర్‌ చేయడం వెనక ఆంతర్యం ఏంటా? అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)