సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్‌ఫిట్ షోలకు అనుమతి లభించింది. ఈ ప్రకటన ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది. అంటే సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్‌ల్లో రూ.410 ధర ఉండనుంది. అలానే 12న అర్థరాత్రి ఒంటి గంట నుంచి రాష్ట్రంలో దాదాపు 23 చోట్ల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినట్లు రివీల్ అయింది. అలానే తొలిరోజు ఆరో షో ప్రదర్శనకు కూడా పర్మిషన్ దొరికింది. అలానే ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి లభించింది.

Here's New Price

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)