Hyderabad, Dec 31: నందమూరి బాలకృష్ణ (Blakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ -సీజన్ 4 (Ram Charan With NBK) కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 'ఆహా' ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. 'ఒరేయ్ చిట్టి .. బాబు వస్తున్నాడు .. రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి' అంటూ ఆహా ఎక్స్ అకౌంట్ నుంచి పోస్టు వచ్చింది. దీంతో నందమూరి, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనేందుకు షూటింగ్ కోసం వచ్చిన రాంచరణ్#RamCharan #UnstoppableWithNBK #Balakrishna #GameChanager pic.twitter.com/UKje6g4ccI
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)