హీరో రామ్‌ పోతినేని జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో 'రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం రామ్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయాలపాలయ్యారు. RAPO19గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రామ్‌కి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)