పాట్ కమిన్స్ ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ నెల 25న సన్ రైజర్స్ సొంతగడ్డ హైదరాబాదులో ఆర్సీబీని ఎదుర్కోనుంది. ఢిల్లీలో ఈ నెల 20 ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన సన్ రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పాట్ కమిన్స్ ను మహేశ్ బాబు కలిశారు. దీనిపై కమిన్స్ సోషల్ మీడియాలో స్పందించాడు. మహేశ్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ గా అభివర్ణించాడు. ఓ మధ్యాహ్నం టాలీవుడ్ యువరాజుతో గడిపాను... ఆయనను కలవడం ఎంతో ఆనందంగా అనిపించింది అని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. అందుకు మహేశ్ బాబు స్పందిస్తూ, ఈ భేటీ ఒక గొప్ప గౌరవం అని పేర్కొన్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)