గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమల్లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్(82) శుక్రవారం కన్నుమూశారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో నివాసం ఉంటున్న జేమ్స్ నేడు ఉదయం తుదిశ్వాస విడిచనట్లు ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. బుధవారం (జూలై 6) సాయంత్రం జిమ్మీ కన్నుమూశారనే విషయాన్ని తెలియజేయడానికి మేం చింతిస్తున్నాం’ అని జేమ్స్ ఫ్యామిలీ ట్వీట్ చేసింది. గాడ్ ఫాదర్ చిత్రంతో గుర్తింపు పొందిన జేమ్స్ కాన్ మిజరీ, ఎల్ఫ్ వంటి తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు పలుమార్లు ఆయన ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.
It is with great sadness that we inform you of the passing of Jimmy on the evening of July 6.
The family appreciates the outpouring of love and heartfelt condolences and asks that you continue to respect their privacy during this difficult time.
End of tweet
— James Caan (@James_Caan) July 7, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)