Pawan Kalyan portrait with 470 kilo of silver: సెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు. వెండి గొలుసులు ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)