అడివిశేష్ హీరోగా శ‌శికిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘మేజ‌ర్‌’. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. పోటీగా విక్ర‌మ్ సినిమా ఉన్నా మేజ‌ర్ మంచి వ‌సూళ్ళ‌ను సాధించింది. ఈ చిత్రంతో శేష్ 60కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టి టైర్‌2 హీరోల‌లో టాప్5లో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్‌ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)