Hyderabad, May 19: సాధారణంగా ఓ సినిమాను (Movie) ఎన్నిసార్లు రీ రిలీజ్ (Re-release) చేస్తారు. రెండు లేదా మూడు సార్లు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు రీ రిలీజ్ చేస్తారు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’ (OM). ఇదో కన్నడ మూవీ (Kannada Movie). నటుడు ఉపేంద్ర (Upendra) దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమ కథానాయిక. 1995 మే 19న (నేటికి 28ఏళ్లు పూర్తి) విడుదలైన ఈ చిత్రం కన్నడనాట సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి (మార్చి 12, 2015 వరకూ) ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేశారు. అత్యధికసార్లు రీరిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం సంపాదించింది.
"Om" has been re released by over 550 times and holds Limca records. pic.twitter.com/sA4zOoyIJT
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) January 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)