మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియం' తెలుగులో 'భీమ్లా నాయక్‌'గా రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే! పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ వీడియో ప్రోమోను వదిలారు. ఇందులో మందు బాటిల్‌తో పాటు మందుగుండ్లను ఎదుట పెట్టుకుని పవన్‌ కూర్చుకున్నాడు.

హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి' అని పవన్‌ చెప్పే డైలాగ్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)