ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారు. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరికి పెళ్లి అయిందంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై లలిత్ మోదీ క్లారిటీ ఇచ్చారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తమకు ఇంకా వివాహం కాలేదని, కానీ త్వరలోనే చేసుకుంటామంటూ ట్వీట్ చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)