సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...' అంటూ సాగే లిరిక్స్ కనెక్టింగ్‌గా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్టవగా... తాజా టైటిల్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లో టైటిల్ సాంగ్ రికార్డులతో దూసుకుపోతోంది. కళావతి, పెన్నీ సాంగ్ రికార్డులను తిరగరాసే విధంగా సాంగ్ ఉందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)