ప్రిన్స్ మహేశ్‌బాబు- డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యిద్దో వాడే పండుగాడు' అనేలా బాక్సీఫీస్‌ రికార్డులను షేక్‌ చేసిన సినిమా ఇది. తాజాగా నేడు(మంగళవారం)మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు.

ప్రపంచ ‍వ్యాప్తంగా 300వరకు షోలతో 4కె వెర్షన్‌లో రీప్రింట్‌తో ఈ సినిమాను థియేరట్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సహా అన్ని చోట్ల టికెట్స్‌ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.దీంతో మహేశ్‌ మేనియా ఏంటన్నది మరోసారి అర్థమవుతుంది. ఇక సోషల్‌ మీడియాలోనూ హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ బాబు అనే ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)