సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్‌ సాంగ్స్‌ ఉండాలని నేను, త్రివిక్రమ్‌ ముందుగానే అనుకున్నాం. ఈ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చు. అందుకే మాస్‌ సాంగ్స్‌ ఉండాలనుకున్నామని అన్నారు.

కుర్చి సాంగ్‌.. నా కెరీర్‌ బెస్ట్‌ కావాలని శేఖర్‌ మాస్టర్‌తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్‌ చేశాడు. శ్రీలీలతో కలిసి డ్యాన్స్‌ చేయడానికి మొదట్లో టెన్షన్‌ పడ్డాను. నెక్లెస్‌ పాట షూటింగ్‌ అయితే ముందే పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు కాన్ఫిడెంట్‌ వచ్చింది.నా కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌ ఇదే’ అని మహేశ్‌ అన్నారు.

మహేశ్‌బాబు మరో రెండు,మూడేళ్ల వరకు తెరపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత మహేశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వడం గ్యారెంటీ. దీంతో మహేశ్‌ బాబు తదుపరి ఎలాంటి చిత్రం చేసినా.. అది పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉండాల్సి రావొచ్చు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)