మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'.ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మెగాస్టార్ విదేశాలకు పయనమయ్యారు.వెకేషన్‌కు అమెరికా వెళ్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా సతీమణితో విమానంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. వెకేషన్‌ నుంచి తిరిగొచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చిరంజీవి వెల్లడించారు.

రామబ్రహ్మం సుంకర నిర్మించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, సుశాంత్‌ కీలక పాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు.ఈ మూవీలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది.

Chiranjeevi USA Tour

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)