మైఖేల్ జాక్సన్ 2009 జూన్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం విదితమే. దిస్ ఈజ్ ఇట్ టూర్ కోసం ప్రిపేరవుతున్న పాప్ స్టార్ తన ఇంట్లో హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు. తాజాగా మైఖేల్ జాక్సన్ గురించి మరికొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. 50 ఏళ్ల జాక్సన్ తన మృతికి ముందే చాన్నాళ్ల నుంచి డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుస్తోంది. ఎంజేపై రూపుదిద్దుకున్న కొత్త డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని బయటపెట్టారు.
దాని కోసం 19 రకాల ఫేక్ ఐడీలను కూడా మైఖేల్ జాక్సన్ క్రియేట్ చేసినట్లు కొత్త డాక్యుమెంటరీలో చూపించారు. వేర్వేరు డాక్టర్ల వద్దకు వెళ్లే జాక్సన్ డ్రగ్స్ కోసం రకరకాల ఐడీలు వాడినట్లు అనుమానిస్తున్నారు.టీఎంజెడ్ ఇన్వెస్టిగేట్స్ ఊ రియల్లీ కిల్డ్ మైఖేల్ జాక్సన్ పేరుతో ఆ డాక్యుమెంటరీని వచ్చే నెలలో ఫాక్స్ ఛానల్‌లో ప్రసారం చేయనున్నారు.
New documentary reveals Michael Jackson used 19 fake IDs to obtain drugs
Read @ANI Story | https://t.co/jttSxTkoZD#MichaelJackson #Hollywood #MichaelJackson64th pic.twitter.com/0o04HZTXjv
— ANI Digital (@ani_digital) August 30, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)