విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు బుధవారం సభలో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదించిన విషయం విదితమే. అయితే, వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఈ వ్యవహారంపై స్పందించాడు.

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదన్న జూనియర్ ఎన్టీఆర్... అదే సమయంలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు. 'విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు' అని తారక్ పేర్కొన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)