కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఓటీటీ ప్లే అనే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశ వ్యాప్తంగా ఓటీటీ కంటెంట్ లో ఈ అవార్డులను ఇచ్చింది. దయా వెబ్ సిరీస్ కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేని అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను వారు అందుకున్నారు.

Tollywood Hero JD Chakravarthy Wins Best Actor Award For Dayaa

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)