పాకిస్థాన్‌కు చెందిన మోడ‌ల్‌ సౌలేహ సిక్కు మ‌త‌స్థుల‌ను అవ‌మానించే విధంగా క‌ర్తార్‌పూర్‌లో (Gurdwara Darbar Sahib in Kartarpur) ఉన్న గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్ నిర్వ‌హించింది. ఆ ఫోటోల‌ను (Bareheaded Photo) ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. దీని ప‌ట్ల సిక్కు సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. త‌ల‌పై దుప‌ట్టా లేకుండా గురుద్వారాలో తిర‌గ‌డం సిక్కు వ‌ర్గీయుల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మే అని శిరోమ‌ణి అకాలీ ద‌ళ్ ఆరోపించింది. మ‌న్న‌త్ క్లాతింగ్ బ్రాండ్ కోసం సౌలేహ క‌ర్తార్‌పూర్‌లో ఫోటోషూట్ చేసింది.

గురుద్వారాకు వెళ్లిన వారు క‌చ్చితంగా త‌మ త‌ల‌పై ఏదైనా వ‌స్త్రాన్ని ధ‌రించాల్సి ఉంటుంది. ఆ ప‌విత్ర స్థ‌లానికి మ‌ర్యాద‌పూర్వ‌కంగా సిక్కులు ఇలా చేస్తుంటారు. అయితే ఫోటో షూట్‌పై విమ‌ర్శ‌లు త‌లెత్త‌డంతో.. మోడ‌ల్ సౌలేహ క్ష‌మాప‌ణ‌లు (Pakistan Model Sauleha Apology) చెప్పింది. ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు. సిక్కు నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల ఆధారంగా పాకిస్థాన్ పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)