Hyderabad, March 25: మెగా అభిమానులకు (Mega Fans), ముఖ్యంగా పవన్ కల్యాణ్ (Pavan Kalyan) – సాయితేజ్ (Sai Tej) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ - సాయితేజ్ 'వినోదయా సితం' సినిమా రీమేక్ లో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని (Samudrakhani) దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో 'వినోదయా సితం' దర్శకుడు కూడా ఆయనే. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో సూపర్ హిట్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. తమిళంలో కూడా చాలా తక్కువ రోజుల్లో షూటింగు పూర్తిచేసుకున్న సినిమా ఇది. అందువలన ఇక్కడ కూడా అదే స్పీడ్ తో పూర్తిచేయనున్నారు. జులై 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ ది ప్రధానమైన పాత్ర అనీ .. సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కథ అంతా కూడా సాయితేజ్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.
#PKSDT storming in theatres from 2️⃣8️⃣th July 2023🌀
Bombarding updates on the way💥@PawanKalyan @IamSaiDharamTej@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth pic.twitter.com/SVuBxB2xjA
— BA Raju's Team (@baraju_SuperHit) March 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)