జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ దంపతులకు తల్లి, వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లీ వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికు పాదాభివందనం చేశారు. తమ్ముడిని అప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ ఆ తర్వాత తన తల్లి, వదిన పాదాలకు కూడా నమస్కరించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)