ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపుతున్న సంగతి విదితమే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది.ఆలస్యం చేయకుండా షమీకి పెళ్లి ప్రపోజల్ కూడా చేసింది.
షమీని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని సోషల్ మీడియా వేదికగా పాయల్ తెలిపింది. అయితే ఒక కండిషన్ కూడా పెట్టింది. షమీ తన ఇంగ్లీష్ ను మెరుగు పరుచుకోవాలని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పాయల్ ఘోష్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం' సినిమాతో ఆమె సినీ పరిశ్రమకు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)