బాలీవుడ్‌ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) గత రాత్రి మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్‌ చేశారు. ఆమె మరణ వార్త గురించి పూనమ్‌ పాండే పీఆర్‌ టీమ్‌ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్‌ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో, ఈ విషయాన్ని మేము షేర్‌ చేసేందుకు ఎంతో చింతిస్తున్నాము. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం.' అని అందులో ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రముఖ నటి పూనమ్ పాండే క్యాన్సర్‌తో మృతి, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షాకింగ్ పోస్ట్, నిజమా కాదా అనే అయోమయంలో అభిమానులు

పూనమ్ పాండే 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని కామెంట్‌ చేసి వైరల్‌ అయ్యారు. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె... సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమె మృతిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తున్నారు.

Here's Death News

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Here's Netizens’ Reactions

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)