ఏపీ మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి ఆయ‌న‌ను ప్రభుత్వ అధికారులు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి తీసుకెళ్లారు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై రామ్ గోపాల్ వర్మ ఇటీవ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌తో ఈ వివాదంపై చ‌ర్చించ‌డానికి మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలోనే ఆర్జీవీ అమ‌రావ‌తి వెళ్లారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై ఇరువురూ చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం ఇరువురూ క‌లిసి మీడియా స‌మావేశంలో మాట్లాడే అవ‌కాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)