గుంటూరు కారం సినిమాలో ఓ మై బేబీ లిరికల్ సాంగ్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నా కాఫీ కప్పులో షుగర్ క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..' అంటూ ఈ పాట మొదలైంది. అయితే చాలామంది ఈ పాట ట్యూన్, లిరిక్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాట బాగోలేదని విమర్శిస్తున్నారు.ఈ క్రమంలో కొందరు హద్దులు మీరుతూ దూషిస్తూ మాట్లాడారు. దీంతో ఓపిక నశించిన గేయరచయిత రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు.
ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చేయలేం. అది తెలుసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి అంటూ హెచ్చరించారు.
Here's Tweets
ప్రతివాడు మాట్లాడేవాడే
రాయి విసిరే వాడే
అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది
పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని
మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే
లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి
— RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023
Social media is going to DOGS..
…people who do not know a thing abt the process..think that they can comment and judge…with all d ill intentions..of spreading hate..targeting the technicians…NO..NOT at all good..ఎవరో ఒకరు మాట్లాడాలి..గీతలు దాటుతున్నారు వీళ్ళు.. https://t.co/zF2xViOw0r
— RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)