రష్యా పాప్‌ సింగర్‌ సింగర్ దిమా నోవా(34) నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 19న తన సోదరుడు, స్నేహితులతో ఫ్రోజన్‌ వోల్గా నది దాడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దిమా నోవా, అతడి స్నేహితులు, సోదరుడు మంచు కురుకుపోయారు.ఈ క్రమంలో ఊపరి ఆడక ఆయన చనిపోయినట్లు రష్యన్‌ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంగా గాయపడిన తన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మిగిలిన వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.

Here's Update

 

View this post on Instagram

 

A post shared by CREAM SODA (@creamsodamusic)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)