యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్ రోల్‌లో సీక్వెల్‌గా నటించిన చిత్రం టిల్లు 2. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మార్చి 29న విడుద‌లైన టిల్లు 2 బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబట్టింది. స్టార్ భాయ్‌ టిల్లు అన్‌స్టాపబుల్ జర్నీతో రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. రామ్‌ మిర్యాల సంగీతం అందించిన ఈ మూవీలో మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. టిల్లు 3తో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నట్టు టిల్లు 2లో ఓపెన్‌ ఎండింగ్‌ ఇచ్చి.. మూవీ లవర్స్‌లో మరింత జోష్‌ నింపుతున్నాడు సిద్దుజొన్నలగడ్డ .

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)