మహేష్ బాబు శ్రీరామ నవమి రోజున సితార లోని మరో టాలెంట్‌ని పరిచయం చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మహేష్ బాబు గారాల పట్టి సితార కూచి పూడి నాట్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు (Mahesh Babu) తన పోస్ట్‌లో రాస్తూ అద్భుతమైన వీడియోని షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని... (Sithara Gattamaneni) సితార పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘సితార తొలి కూచిపూడి నృత్య ప్రదర్శన. పరమ పవిత్రమైన శ్రీరామ నవమి రోజున ఈ అందరితో ఈ వీడియోషేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. సీతూ పాప.. నీ పని పట్ల నువ్వు చూపించే శ్రద్ధ చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. నువ్వు నన్నింకా గర్వపడేలా చేస్తున్నావు. సితారకు డాన్స్‌లో శిక్షణ ఇచ్చిన అరుణ బిక్షు, మహతి బిక్షులకు ధన్యవాదాలు’’ అన్నారు.అలాగే మహేష్ సతీమణి నమత్ర సైతం సదరు వీడియోను షేర్ చేసి ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు.
In awe of you my Situ Papa and your dedication to your craft! You make me more and more proud! 😘🤗😘 Immense respect and love to you my little one ♥️♥️♥️ Thank you #ArunaBhikshu garu and @mahathibhikshu for being her teachers of this beautiful dance form 🙏🙏🙏
— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)