అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని చెప్పారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారన్నారు. సినీనటిగా కళాసేవకే పరిమితం కాకుండా ఎంపీగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
Here's CMO Telangana Tweet
తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
— Telangana CMO (@TelanganaCMO) January 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)