సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం ట్రైలర్ విడుదలయింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కొద్ది గంటల్లోనే మిల్లియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్ ఆరంభం అవుతుంది. విజువల్స్, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్ అని చెప్పొచ్చు. సమంత లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ట్రైలర్‌లో కనిపిస్తున్న మ్యాజిక్ సినిమాలోనూ వర్కవుట్ అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది.
Here's Trailer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)