టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించి కాపాడిన మహేష్ ..తన పేరు మీద ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా తన సహాయా సహకారాలను మరింతగా విస్తరింపజేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో అద్భుతమైన కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు.

ఈ ప్రత్యేకమైన రోజున ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపారు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ గవర్నర్‌కు అలాగే, ఆంధ్ర రాష్ట్ర ఆసుపత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేష్ అభిమానులు మారోసారి తమ అభిమాన హీరో చేసిన ఈ గొప్ప కార్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమ్రత పెట్టిన ఈ పోస్టును సోషల్ మీడియాలో పంచుతూ వైరల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)