సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హిందీ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో బీర్బల్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. షోలే' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)