తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్.శంకరన్ 93 సంవత్సరాలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఈయన శిష్యుడే. తన గురువు మృతి పట్ల భారతీరాజా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా శంకరన్ సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. 1999లో చివరిసారిగా 'అళగర్ సామి' చిత్రంలో నటించారు. 1974లో 'ఒన్నే ఒన్ను కన్నె కన్ను' చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
Here's News
Veteran actor-director #RaSankaran passed away at the age of 92.https://t.co/3C0VkPp49h
— TNIE Tamil Nadu (@xpresstn) December 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)