ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు . ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంత్ సావర్కర్ ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. "హరి ఓం విఠల", "గద్బద్ గోంధాల్", "66 సదాశివ్", "బకాల్", "యుగ్ పురుష్", "వాస్తవ్", "సింగం" వంటి సినిమాలు కూడా ఉన్నాయి.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Veteran actor Jayant Sawarkar (Photo-Twitter)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)