బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. తాజాగా బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్‌లో లాగిన్‌ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు.

తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్‌ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్‌ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  ఫోన్ స్విచ్ఛాఫ్, పరారీలో బిగ్‌బాస్‌ సీజన్‌–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

Here's Video

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)