టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా సామిరంగ'. తాజాగా ఈ చిత్రం నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజైంది. దేవుడే... తన చేతితో... రాసిన... ఒక కావ్యం... అంజిది, కిష్టయ్యది విడదీయని ఒక బంధం... అంటూ సాగే ఈ గీతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేశ్ మధ్య స్నేహానుబంధాన్ని చాటుతోంది.

ఎంఎం కీరవాణి ఈ పాటకు బాణీలతో పాటు లిరిక్స్ కూడా అందించారు. ఈ గీతాన్ని శాండిల్య పీసపాటి ఆలపించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామిరంగ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ తదితరులు నటించారు.

Here's Song

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)