బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. దిశా పటానీ, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'యోధ' ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను ఉచితంగా చూడలేరు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మే 10 నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. ప్లాప్ అయిన సినిమాకు ఇంత డబ్బు చెల్లించడం ఎందుకు..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సలార్, యానిమల్ లాంటి హిట్ సినిమాలకు కూడా ఇలాంటి షరతులు లేవని విమర్శిస్తున్నారు.
కాగా మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సుమారుగా రూ.55 కోట్లు బడ్జెట్ పెడితే.. రూ.32 కోట్లు మాత్రమే తిరిగొచ్చాయి.
Here's News
Hindi film #Yodha is now available to rent on Amazon Prime Video Store.
It will stream for subscribers without rent from May 10th. pic.twitter.com/8vBh6H0Vtv
— Streaming Updates (@OTTSandeep) April 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)