సౌత్‌ కొరియాకు చెందిన నటి యో జూ యూన్‌ ఆగస్ట్‌ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్‌ నోట్‌ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ ఆమె రాసిన ఈ సూసైడ్‌ నోట్‌ అటూ సౌత్‌ కొరియా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సినీ పరిశ్రమలో సైతం చర్చనీయాంశమైంది.నాకు నటించాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఒకవేళ అది నాలో ఒక భాగమేమో. కానీ ఆ జీవితం అంత సులభం కాదు. నాకు ఇంకేమీ చేయాలని లేదు. అదే నాకు నిరాశ. మనం నచ్చింది చేయాలనుకోవడం వరం. కానీ అది మాత్రమే చేయాలనుకోవడం శాపం అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)